జులై 1: నేటి నుంచి కొత్త రూల్స్
నేటి నుంచి కొత్త పాన్‌కార్డు కోసం అప్లికేషన్ సమయంలో ఆధార్ కార్డు కాపీని అందించడం తప్పనిసరి. సీబీడీటీ ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.
By అంజి
జులై 1: నేటి నుంచి కొత్త రూల్స్
నేటి నుంచి పలు కీలక రూల్స్ మారాయి. ఇవి సామాన్యుల దైనందిన జీవితం, ఖర్చులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపనున్నది. మారిన రూల్స్‌కు సంబంధించిన వివరాలు కింద ఉన్నాయి.
పాన్‌కార్డ్: నేటి నుంచి కొత్త పాన్‌కార్డు కోసం అప్లికేషన్ సమయంలో ఆధార్ కార్డు కాపీని అందించడం తప్పనిసరి. సీబీడీటీ ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాన్ ఉంటే.. దానికి ఆధార్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి. ఈ రెండింటిని అనుసంధానించేందుకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అనుమతిచ్చింది.
పెరిగిన రైలు టికెట్ చార్జీలు
అర్ధరాత్రి 12 గంటల నుంచి కొత్త రైల్వే ఛార్జీలు, టికెట్ బుకింగ్స్ అమల్లోకి వచ్చాయి. రైల్వేబోర్డు జారీ చేసిన సర్క్యులర్ మేరకు అన్ని జోన్ల మేనేజర్లు పెరిగిన ఛార్జీలను అమలు చేశారు. ఏసీ క్లాస్‌కు కిలోమీటర్‌కు రెండు పైసలు, నాన్ ఏసీ, స్లీపర్, సెకండ్ క్లాస్ టికెట్లపై కిలోమీటర్‌కు పైసా చొప్పున పెరిగాయి. ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వారికి పెంచిన ఛార్జీలు వర్తించవు.
తత్కాల్ టికెట్ల బుకింగ్
తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరిగా మారింది. ఇకపై తత్కాల్ టికెట్లు ఐఆర్‌సీటీసీ అకౌంట్‌తో ఆధార్ లింక్ చేసిన ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. నేటి నుంచి ఓటీపీ ఆధారిత అథంటికేషన్ తప్పనిసరి చేసింది. దాంతో ఆధార్ అకౌంట్‌తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
క్రెడిట్ కార్డ్ బిల్లులు
అన్ని రకాల క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపు కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ (బీబీపీఎస్) వ్యవస్థ ద్వారా అన్ని క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ నిర్ణయంతో బిల్ డెస్క్, ఫోన్‌పే, క్రెడ్ వంటి యాప్‌లను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 8 బ్యాంకులు మాత్రమే బీబీపీఎస్ సౌకర్యాన్ని ప్రారంభించాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం..
ఏటీఎంతో పాటూ యూపీఐ లావాదేవీలపై విధించే చార్జీల్లో ఐసీఐసీఐ బ్యాంక్ మార్పులు చేసింది. ఇకపై కస్టమర్స్ ఐసీఐసీ బ్యాంక్ ఏటీఎంని ఉపయోగిస్తే పరిమితి దాటిన తర్వాత చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రతి నెలా మూడు లావాదేవీలు, చిన్న నగరాల్లో ప్రతి నెలా ఐదు లావాదేవీలు మాత్రమే ఫ్రీ. ఆ తర్వాత జరిపే ప్రతి ఒక్క లావాదేవీకి రూ.23 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ తనిఖీ, అదనంగా సేవలు ఉపయోగించుకున్నా ప్రతి ఒక్కదానికి రూ.8.5 వసూలు చేయనున్నది.
హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎం నిబంధనల్లో పలు మార్పులు చేసింది. బ్యాంక్ కస్టమర్లు ప్రతి నెలలో ఐదుసార్లు మాత్రమే ఉచితంగా నగదు విత్‌డ్రాకు ఛాన్స్ ఉంటుంది. పరిమితి దాటితే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్‌కు ఛార్జీలు విధిస్తుంది. మెట్రో పాలిటన్ నగరాల్లో మూడు ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లావాదేవీలు జరుపుకోవచ్చు. ఆ తర్వాత లిమిట్ దాటిన తర్వాత ప్రతి లావాదేవీకి రూ.23తో పాటు జీఎస్టీని వసూలు చేయనున్నది. ఇతర సేవలకు రూ.8.50తో పాటు జీఎస్టీని వసూలు చేస్తుంది.