మ‌రో వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోదం.. జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కు అనుమ‌తులు

Johnson and Johnsons single dose vaccine is given approval for emergency use.క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2021 2:13 PM IST
మ‌రో వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోదం.. జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కు అనుమ‌తులు

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే మార్గం అని నిపుణులు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. దేశంలో వ్యాక్సినేష‌న్ కొర‌త‌ను అధిగ‌మించేందుకు కేంద్రం విదేశీ వ్యాక్సిన్ల‌కు అనుమ‌తి ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీ సింగిల్ డోసు కోవిడ్ టీకాకు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. అత్య‌వ‌స‌ర వినియోగ అనుమ‌తులు పొందింది. జాన్స‌న్ టీకాకు అత్య‌వ‌స‌ర అనుమ‌తులు మంజూరు చేసిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మ‌న్‌సుఖ్ మాండ‌వీయ ట్వీట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.

దీంతో భార‌త్ త‌న వ్యాక్సిన్ సామ‌ర్థ్యాన్ని పెంచేసింది. జాన్స‌న్ అండ్ జాన్స‌న్‌కు అత్య‌వ‌స‌ర వినియోగం కోసం ఆమోదం ద‌క్క‌డంతో భార‌త్‌లో వినియోగించ‌నున్న అయిద‌వ టీకా కానున్న‌ది. భార‌త్ తన టీకా ప‌రిధిని విస్త‌రించింది. జాన్స‌న్ అండ్ జాన్స‌న్‌కు చెందిన సింగిల్ డోసు టీకా అత్య‌వ‌స‌ర వినియోగ అనుమ‌తులు పొందింది. దీంతో భార‌త్‌లో అత్య‌వ‌స‌ర వినియోగం కోసం ఆమోదం పొందిన టీకాల సంఖ్య ఐదుకు చేరింది. కొవిడ్ పై మ‌న‌దేశం జ‌రుపుతోన్న పోరాటానికి ఇది తోడ్పాడునివ్వ‌నుంది అని మ‌న్‌సుఖ్ మాండ‌వీయ ట్వీట్ చేశారు.

దేశ‌వ్యాప్తంగా కోవాగ్జిన్‌, కోవీషీల్డ్‌, స్పుత్నిక్, మోడెర్నా టీకాల అత్య‌వ‌స‌ర వినియోగానికి ఆమోదం ద‌క్కిన విష‌యం తెలిసిందే. ఆగ‌స్టు 5వ తేదీన సింగిల్ డోసు అప్రూవ‌ల్ కోసం జాన్స‌న్ కంపెనీ భార‌త ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ది. హైద‌రాబాద్‌కు చెందిన బ‌యోలాజిక‌ల్ ఈ సంస్థ‌తో జాన్స‌న్ కంపెనీ ఈ టీకాను ఉత్ప‌త్తి చేయ‌నున్న‌ది. సింగిల్ షాట్ వ్యాక్సిన్‌తో కరోనా వైర‌స్‌ను 85 శాతం స‌మ‌ర్థ‌వంతంగా నిర్మూలించే అవ‌కాశాలు ఉన్నాయి.

Next Story