జీన్స్‌, టీషర్ట్‌లపై కాలేజ్‌ నిషేధం.. వ్యతిరేకిస్తున్న విద్యార్థులు

మహారాష్ట్ర చెంబూరులోని ఆచార్య మరాఠే కాలేజీ యాజమాన్యం కొత్త ఆదేశాలను జారీ చేసింది.

By Srikanth Gundamalla
Published on : 3 July 2024 9:14 AM IST

jeans, t-shirt, ban,  Maharashtra, chembur ,college,

జీన్స్‌, టీషర్ట్‌లపై కాలేజ్‌ నిషేధం.. వ్యతిరేకిస్తున్న విద్యార్థులు

కాలేజీలకు విద్యార్థులు స్టైలిష్‌గా ఉన్న బట్టలను ధరించి వెళ్తున్న కాలం ఇది. ఎక్కువగా జీన్స్‌, టీషర్ట్‌ సహా ఇతర రకలా దుస్తులను ధరిస్తున్నారు. అయితే.. మహారాష్ట్ర చెంబూరులోని ఆచార్య మరాఠే కాలేజీ యాజమాన్యం కొత్త ఆదేశాలను జారీ చేసింది. జీన్స్‌, టీషర్ట్‌లను కాలేజ్‌లోకి అనుమతించబోము అని ప్రకటన చేసింది. దాంతో.. విద్యార్థులు కాలేజ్‌ యాజమాన్యం నిర్ణయాన్ని వ్యతిరేస్తున్నారు. గతంలో హిజాబ్‌ను నిషేధించారు. ఇప్పుడు జీన్స్‌, టీషర్ట్‌లా అంటూ మండిపడుతున్నారు.

బుర్ఖాలు, నిఖాబ్ లు, హిజాబ్ లు, ఇతర మతపరమైన చిహ్నాలైన బ్యాడ్జీలు, టోపీలు, దుస్తులపై గతంలో చెంబూరు కాలేజ్‌ నిషేధం విధించింది. దీన్ని హైకోర్టు కూడా సమర్ధించడంతో హాట్‌టాపిక్‌ అయ్యింది. తాజాగా మరో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. కాలేజ్‌కు వేసుకురావాల్సిన డ్రెస్‌కోడ్‌లో అబ్బాయిలు ప్యాంటు, హాఫ్ లేదా ఫుల్ షర్ట్, అమ్మాయిలు శరీరాన్ని పూర్తిగా కప్పే ఏదైనా ఇండియన్/ వెస్ట్రన్ డ్రెస్ ఉండాలని కాలేజీ యాజమాన్యం సూచించింది. ఫార్మల్‌.. మంచి దుస్తులను ధరించాలని ఆదేశాలను జారీ చేసింది. కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు జీన్స్, టీషర్టులు కూడా ధరించకూడదని కాలేజీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.

కాలేజ్‌ యాజమాన్యం వ్యవహారంపై విద్యార్థులు మండిపడుతున్నారు. డ్రోస్‌ కోడ్ నిబంధనతో తమ మత, సాంస్కృతిక హక్కును ఉల్లంఘిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. సాధారణ దుస్తుల్లో భాగంగా ఉండే జీన్స్‌ ధరించాననీ.. అయితే సెక్యూరిటీ గార్డు కాలేజ్‌ గేటు వద్ద ఆపేశాడని ఓ విద్యార్థిని పేర్కొంది. జీన్స్‌ వేసుకోవడంలో తప్పేమీ లేదనీ.. విద్యార్థుల ప్రస్తుత జీవన శైలిని దృష్టిలో పెట్టుకోవాలని పేర్కొంది. సెక్యూరిటీ గార్డు తనని ఆపడం వల్ల క్లాస్‌లు మిస్‌ అయ్యాననీ.. అలాగే ఈ నిబంధన వల్ల ఎలాంటి డ్రెస్‌లు వేసుకోవాలనే ఒత్తడి తమలో పెరుగుతుందని విద్యార్థిని పేర్కొంది.

కొన్ని రకాల జీన్స్‌, టీషర్టులపై అభ్యర్థులు ఉన్నట్లు కాలేజ్‌ ప్రిన్సిపాల్ విద్యాగౌరి లేలే తెలిపారు. అయితే.. వాటిని వర్గీకరించడానికి బదులు విద్యార్థలందరూ జీన్స్‌, టీషర్టులపై నిషేధం విధించామని చెప్పారు. విద్యార్థులతో తాను వ్యక్తిగతంగా కూడా మాట్లాడినట్లు ప్రిన్సిపాల్ విద్యాగౌరి లేలే తెలిపారు.

Next Story