'అగ్నిపథ్‌'పై పునఃసమీక్షించాలి... ఎన్డీఏకు మద్ధతు వేళ JDU డిమాండ్!

సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగానే వచ్చాయి.

By Srikanth Gundamalla  Published on  6 Jun 2024 5:15 PM IST
jdu, demand,  new central govt, bjp, modi,

'అగ్నిపథ్‌'పై పునఃసమీక్షించాలి... ఎన్డీఏకు మద్ధతు వేళ JDU డిమాండ్!

సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగానే వచ్చాయి. గతంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మిత్రపక్షాల సాయం అవసరం లేకుండానే బీజేపీ మెజార్టీ దక్కించుకుంది. కానీ ఈసారి పరిస్థితులు మారాయి. బీజేపీకి సరిపోయే అన్ని సీట్లు రాలేదు. దాంతో.. మిత్రపక్షాల అవసరం కచ్చితంగా కావాల్సి వస్తోంది. ఇప్పుడు టీడీపీ, జేడీయూ మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయా పార్టీలు తమకు కావాల్సిన డిమాండ్లను బీజేపీ ముందు ఉంచుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా జేడీయూ సీనియర్‌ నేత ఒక డిమాండ్‌ ముందుంచారు.

ఎన్నికల వేళ ఉత్తరాదిన బాగా చర్చకు వచ్చిన అంశాల్లో అగ్నిపథ్ స్కీమ్ ఒక్కటి. దీనిపైనే జేడీయూ నేత కేసీ త్యాగి మాట్లాడారు. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని ప్రస్తావన తెచ్చారు. అగ్నిపథ్‌ స్కీమ్ను పునఃసమీక్షించాలని చెప్పారు. ఈ స్కీమ్‌ను చాలా మంది వ్యతిరేకించారని అన్నారు. ఎన్నికల్లో కూడా ఈ స్కీమ్‌ ప్రభావం పడిందని చెప్పారు. అయితే.. దీని విషయంలో ప్రభుత్వంతో గొడవపడాలని అనుకోవట్లేదు అంటూనే.. పునఃసమీక్ష అవసరమే కామెంట్స్ చేశారు జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగి. దీంతో పాటు బిహార్‌కు ప్రత్యేక హోదా, దేశవ్యాప్త కులగణన వంటి అంశాలను తెరపైకి తెస్తోంది.

కాగా.. అగ్నిపథ్‌ స్కీమ్‌ను కేంద్రం 2022లో తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌ అగ్నివీర్‌లుగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికైన వారు నాలుగేళ్లు పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో 25 శాతం మంది మాత్రమే మరో 15 ఏళ్లు పని చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతో..ఈ స్కీమ్‌ కేంద్రం తెచ్చినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు దేశంలో వచ్చాయి.

Next Story