శ్రీనగర్‌ దాల్‌ సరస్సులో అగ్నిప్రమాదం, అనేక బోట్లు దగ్ధం (వీడియో)

జమ్ముకశ్మీర్‌ లోని శ్రీనగర్‌లో ఉన్న దాల్‌ సరస్సులో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla
Published on : 11 Nov 2023 1:06 PM IST

jammu kashmir, srinagar, dal lake, fire accident,

శ్రీనగర్‌ దాల్‌ సరస్సులో అగ్నిప్రమాదం, అనేక బోట్లు దగ్ధం (వీడియో)

జమ్ముకశ్మీర్‌ లోని శ్రీనగర్‌లో ఉన్న దాల్‌ సరస్సులో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సరస్సులో ఉన్న హౌజ్‌బోట్లకు తెల్లవారుజామున ఉన్నట్లుండి నిప్పంటుకుంది. దాంతో.. ఒకదాని నుంచి మరో బోట్లకు మంటలు వ్యాపించాయి. మంటలు వేగంగా వ్యాపించి భారీగా చెలరేగాయి. ఈ సంఘటనలో అనేక బోట్లు కాలి బూడిద అయ్యాయి. అయితే.. ప్రస్తుతం దాస్‌ సరస్సుల్లో భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనేక బోట్లు మంటల్లో బూడిద కావడంపై పలువురు అయ్యో అంటున్నారు.

ఇక దాల్‌ సరస్సులో మంటలు చెలరేగిన సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటనాస్థలికి వచ్చి మంటలను అదుపు చేశారు. దాల్‌ సరస్సులోని ఘాట్ నెంబర్ 9 దగ్గర హౌస్‌బోట్‌లో ఉదయం 5 గంటల సమయంలో మంటలు ముందుగా చెలరేగాయని పోలీసులు గుర్తించారు. వెంటనే ఇతర బోట్లకు వ్యాపించాయని చెప్పారు. దాంతో.. ప్రమాద తీవ్రత పెరిగిందని అన్నారు. బోట్లు చాలా వరకు కాలిపోయాయని అన్నారు.

సరస్సు వద్ద భారీ ఎత్తున మంటలు, దట్టమైన పొగ వ్యాపించిందని పోలీసులు వెల్లడించారు. ఐదు నుంచి 8 పడవల వరకు పూర్తిగా కాలిపోగా.. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. కాగా.. తెల్లవారు జామున ప్రమాదం జరగడం.. దాంతో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదన్నారు. కేసు నమోదు చేసుకున్నామని.. అసలు మంటలు ఎందుకు చెలరేగాయి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు పోలీసులు.

Next Story