జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల
కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి రాజకీయ పార్టీలు.
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 12:00 PM ISTజమ్ముకశ్మీర్‌లో ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల
కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి రాజకీయ పార్టీలు. ఈ మేరకు బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. మొత్తం మూడు విడతలకు సంబంధించి 44 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ వెల్లడించింది. మొత్తం మూడు విడతలకు సంబంధించి 44 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తొలి విడతలో 15 మంది, రెండో విడత కోసం 10 మంది, మూడో దశకు 19 మంది అభ్యర్థనలను కమల దళం ఖరారు చేసింది.
2019లో ఆర్టికల్ 370 రద్దు అవ్వడంతో రాష్ట్ర హోదా కోల్పోయి జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. చివరిసారి 2014లో ఐదు దశల్లో జరిగాయి. ఈసారి మూడు విడతల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. జమ్ముకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో భాగంగా తొలిదశలో 24 అసెంబ్లీ స్థానాలకు, రెండు, మూడు దశల్లో వరుసగా 26, 40 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు ఎన్నికల సంఘం అధికారులు. సెప్టెంబరు 18న తొలి విడత, సెప్టెంబరు 25న రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. చివరి దశ ఎన్నికల పోలింగ్ అక్టోబరు 1న నిర్వహించనున్నారు. ఇక జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4న వెల్లడికానున్నాయి. బీజేపీ జాబితాలో మాజీ ఉప ముఖ్యమంత్రులు నిర్మల్ సింగ్, కవీందర్ గుప్తా, రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా పేర్లు లేవు.