జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం
Jammu encounter .. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆగడాలను భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయి. తాజాగా భద్రతా
By సుభాష్ Published on 19 Nov 2020 10:29 AM IST
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆగడాలను భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయి. తాజాగా భద్రతా బలగాలు- ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రమూకలు హతం అయ్యారు. ఉగ్రవాదుల కదలికలపై భద్రతా దళాలకు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందడంతో జమ్మూనగరంల సమీపంలో బాన్ టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి బస్సులో వచ్చిన ఉగ్రవాదులు భద్రతాబలగాలను చూసి కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ ఫోర్స్ ఉగ్రవాదులను వెంబడించి కాల్పులు జరిపారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సైనికులు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారని జమ్మూ ఎస్పీ శ్రీధర్ పాటిల్ వెల్లడించారు. ఈ ఘటనలో జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. జమ్మూతోపాటు ఉధంపూర్ జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. నగ్రోటా చెక్ పోస్టు ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. వీరంతా సరిహద్దులు దాటి దేశంలోకి చొరబడిన ముష్కరులని భద్రతా బలగాలు తెలిపాయి.
కాగా, బాన్ టోల్‌ప్లాజాలో ఈఏడాది జనవరి 31న కూడా ఇదే తరహాలో ఎన్‌కౌంటర్ జరిగిందని సీఆర్పీఎఫ్ అధికారులు వెల్లడించారు. టోల్ ప్లాజాలో ఉన్న పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో ఒక పోలీసు గాయపడ్డాడని తెలిపారు. అప్పటి కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు పోలీసులు మట్టుబెట్టారని తెలిపారు. అలాంటి ఘటనే ఇప్పుడు జరిగిందని అధికారులు వెల్లడించారు.