బైక్‌పై రొమాన్స్ చేసిన జంట వీడియో వైరల్‌.. పోలీసులు వెతుకులాట‌

Jaipur couple romance on bike during Holi eve. హోలీ రోజున జైపూర్ వీధుల్లో మోటర్‌బైక్‌పై రొమాన్స్ చేసిన జంట కోసం రాజస్థాన్ పోలీసులు వెతుకుతున్నారు.

By M.S.R  Published on  8 March 2023 5:04 PM IST
బైక్‌పై రొమాన్స్ చేసిన జంట వీడియో వైరల్‌.. పోలీసులు వెతుకులాట‌

Jaipur couple romance on bike


హోలీ రోజున జైపూర్ వీధుల్లో మోటర్‌బైక్‌పై రొమాన్స్ చేసిన జంట కోసం రాజస్థాన్ పోలీసులు వెతుకుతున్నారు. ఈ ఘటన జైపూర్‌లోని బీ2 బైపాస్‌లో చోటుచేసుకుంది. హోలీ సందర్భంగా ఈ జంట మోటార్‌బైక్‌పై రొమాన్స్ చేస్తూ స్టంట్స్ వేస్తున్న ఘటన అందరికీ షాకిచ్చింది. పలువురు ఈ ఘటనను తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు.

ఈ వీడియో వైరల్‌గా మారింది. వీడియోను కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి చిత్రీకరించినట్లు తెలుస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌లోని పెట్రోల్ ట్యాంక్‌పై అమ్మాయిని కూర్చోబెట్టుకున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుంది. బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు ఇప్పుడు అన్వేషణ ప్రారంభించారు. నిందితులకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు. ఇంతకుముందు, ఫిబ్రవరిలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. అజ్మీర్ నగరంలో ఒక జంట మోటార్‌బైక్‌పై ముద్దులు పెట్టుకుంటూ కెమెరాకు చిక్కారు.


Next Story