బెంగళూరు: బెడ్‌ కింద దాచిన రూ.42 కోట్లు సీజ్, తెలంగాణకు తరలించేందుకు ప్లాన్

5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. బెంగళూరులో భారీగా నగదు పట్టుబడింది. బెడ్‌ కింద దాచిన రూ.42కోట్లు సీజ్ చేసింది ఐటీ.

By Srikanth Gundamalla  Published on  13 Oct 2023 7:06 AM GMT
IT, seize, Rs.42 crore,  Bangalore,  elections,

బెంగళూరు: బెడ్‌ కింద దాచిన రూ.42 కోట్లు సీజ్, తెలంగాణకు తరలించేందుకు ప్లాన్ 

ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నగరంలో పోలీసులు రంగంలోకి దిగి వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో పలుచోట్ల కోట్లు రూపాయల నగదును పట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా బెంగళూరులోని ఒక ఫ్లాట్లో ఒక కోటి కాదు... రెండు కోట్లు కాదు... ఏకంగా 42 రెండు కోట్ల రూపాయలను ఐటి అధికా రులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికం గా తీవ్ర సంచలనం సృష్టించింది.

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్ విడుదల అయ్యిన విషయం తెలిసిందే. ఈ ఐదు రాష్ట్రాల్లో ముఖ్యంగా రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలకు నిధుల కోసం బెంగళూరులోని బంగారు ఆభరణాలతో పాటు ఇతర వనరుల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించినట్లుగా ఐటీ వర్గాలు తెలియజేశాయి. అక్రమంగా సొమ్ము దాచి ఎన్నికల కోసం పంపుతున్నారనే విశ్వసనీయమైన సమాచారం అందడంతో వెంటనే ఐటీ శాఖ అప్రమత్తమైంది. దాంతో.. బెంగళూరు నగరంలో దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బెంగళూరులోని ఆర్టి నగర్ సమీపంలోని ఆత్మానంద కాలనీలో ఉన్న ఒక ఫ్లాట్‌లో సోదాలు కొనసాగించారు.

ఈ సోదాల్లోని భాగంగానే ఐటీ అధికారులు బెడ్ కింద నుండి ఒక్కొక్క బాక్స్ తీస్తున్న కొద్ది బయటకి వస్తూనే ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 23 పెట్టెలు బయటికి తీసి వాటిని తెరిచి చూసి షాక్‌ అయ్యారు. బెడ్ కింద దాచిన బాక్సుల్లో మొత్తం రూ.42 కోట్లు లభ్యమయ్యాయి. రూ.42 కోట్ల విలువైన 500 నోట్ల కట్టలను 23 పెట్టెలో దాచిపెట్టి వాటిని బెడ్ కింద పెట్టారని ఐటీ అధికారులు వెల్లడించారు. ఐటీ అధికారులకు పక్కా సమాచారం రావడంతో ఆర్ టి నగర్ లోని రెండు చోట్ల దాడులు నిర్వహించారు. ఒకచోట నగదు లభ్యం కాలేదు. మరోచోట పెద్ద మొత్తంలో డబ్బులు లభ్యమయ్యాయి. ఫ్లాట్ ఖాళీగా ఉందని అక్కడ ఎవరు నివసించడంలేదని తెలిసింది. దీంతో అధికా రులు ఫ్లాట్ యజమాని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఐటి అధికారులు ఈ కేసుకు సంబంధించి మాజీ కార్పొరేటర్ తో పాటు ఆమె భర్తను వారి నివాసంలోనే విచారిస్తున్నారు. కార్పొరేటర్ భర్త ఒక కాంట్రాక్టర్. అతను కాంట్రాక్టర్ల సంఘంలో భాగంగా గత బీజేపీ ప్రభుత్వం ప్రాజెక్టులో 40 శాతం కమిషన్ తీసుకుంటుందని ఆరోపించారు. ఐటీ అధికారులు 42 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకొని మాజీ కార్పొరేటర్ తో పాటు ఆమె భర్తను విచారిస్తున్నారు.

అయితే ఈ కోట్ల రూపాయలను ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే కోట్ల రూపాయలను లారీలో బెంగళూరు నుండి హైదరాబాద్ కు తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా విశ్వసనీయమైన సమాచారం రావడంతో ఆదాయపు శాఖ అధికారులు దాడులు చేశారు. రెడ్ హ్యాండెడ్ గా రూ.42 కోట్ల రూపాయలను పట్టుకున్నారు.

Next Story