డ్రాగ‌న్‌కు భార‌త్ భారీ షాక్‌.. 232 చైనా యాప్‌ల‌పై నిషేదం

IT & Electronics Ministry of India Bans 232 Chinese Mobile Apps.చైనాపై భారత్ మరోసారి 'డిజిటల్ స్ట్రైక్' చేసింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Feb 2023 8:45 AM GMT
డ్రాగ‌న్‌కు భార‌త్ భారీ షాక్‌.. 232 చైనా యాప్‌ల‌పై నిషేదం

చైనాపై భారత్ మరోసారి 'డిజిటల్ స్ట్రైక్' చేసింది. చైనాకు చెందిన దాదాపు 232 యాప్‌లను భారత్ నిషేధించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) సిఫార్సుల మేరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ యాప్‌లను నిషేధించాలని మరియు బ్లాక్ చేయాలని ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు హోం మంత్రిత్వ శాఖ ఈ వారం సిఫార్సు చేసింది. వీటిలో 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లు ఉన్నాయి.

భార‌త పౌరుల‌కు ఆర్థికంగా న‌ష్టం చేకూరేలా చేయ‌డంతో పాటు భార‌తీయుల వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని దొంగిలించేలా ఆయా మొబైల్ యాప్‌లు ఉన్నాయి. అందుకే వాటిపై నిషేదం విధించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది.

ఈ యాప్‌లు చిన్న మొత్తంలో రుణాలు పొందిన సామాన్య ప్ర‌జ‌ల నుంచి పెద్ద మొత్తంలో దోచుకుంటున్నాయి. ప‌లు ఇబ్బందులు కార‌ణంగా స‌కాలంలో చెల్లించ‌డంలో విఫ‌లం అయితే.. బారు వ‌డ్డీ, చ‌క్ర వ‌డ్డీని వేస్తున్నాయి. ఇక బెట్టింగ్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప‌లువురు ఈ యాప్‌ల బారిన పడి డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకోవడంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. తెలంగాణ, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పాటు కేంద్ర నిఘా సంస్థలు ఈ యాప్‌లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Next Story