'ఆవులను కసాయిలకు అమ్ముతున్నారు'.. ఇస్కాన్‌పై మేనకా గాంధీ ఆరోపణలు

మతపరమైన వర్గం ఆవులను కసాయిలకు విక్రయిస్తోందంటూ బీజేపీ ఎంపీ మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది.

By అంజి  Published on  27 Sep 2023 7:20 AM GMT
ISKCON, Maneka Gandhi,  cows

'ఆవులను కసాయిలకు అమ్ముతున్నారు'.. ఇస్కాన్‌పై మేనకా గాంధీ ఆరోపణలు

మతపరమైన వర్గం ఆవులను కసాయిలకు విక్రయిస్తోందంటూ బీజేపీ ఎంపీ మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. గోశాలల నిర్వహణ పేరుతో గోవులను కబేళాకు అమ్ముకుంటోందని మేనకా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఇస్కాన్ సంస్థ దారుణ మోసాలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. ఇస్కాన్‌ సంస్థ ప్రభుత్వం నుండి విస్తారమైన భూములతో సహా వివిధ ప్రయోజనాలను పొంది గౌశాలలను స్థాపించి, అవకతవకలకు పాల్పడుతోందన్నారు. దీంతో ఈ వ్యవహారంపై ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) మంగళవారం స్పందించింది.

ఆమె ఒక గోశాల సందర్శన గురించి మాట్లాడుతూ.. తాను ఇటీవల వారి అనంతపూర్‌లోని గోశాలను సందర్శించాను. అక్కడ ఒక్క ఆవు కూడా లేదని, అన్నింటినీ కబేళాకు అమ్మేశారని మండిపడ్డారు. గోమాతను నిర్దాక్షిణ్యంగా కసాయి వాళ్లకు అమ్ముకునే ఇలాంటి వాళ్లే రోడ్లపై హరేరామ.. హరేకృష్ణ అంటూ వల్లెవేస్తుంటారని విమర్శించారు. "ఇస్కాన్ తన ఆవులన్నింటినీ కసాయిలకు విక్రయిస్తోంది" అని ఆమె ఆరోపించింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత.. ఇస్కాన్ ఆ దావాను "నిరాధారమైన, తప్పుడు సమాచారం"గా పేర్కొంది.

గోసంరక్షణకు తమ నిబద్ధతను తెలియజేస్తూ, తాము 60కి పైగా గోశాలలను నిర్వహిస్తున్నామని, వందలాది ఆవులు, ఎద్దులను వాటి జీవితమంతా సంరక్షిస్తున్నామని ఇస్కాన్ పేర్కొంది. ఎంపీ ప్రకటనలపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఇస్కాన్‌ అనంతపురం గోశాలకు సంబంధించి వెటర్నరీ వైద్యుడి లేఖ, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల అంచనా నివేదికలు, వీడియోను షేర్ చేసింది. ప్రతిస్పందన, వీడియోను పంచుకుంటూ, ఇస్కాన్ ఇండియా కమ్యూనికేషన్స్ డైరెక్టర్ యుధిస్తీర్ గోవింద దాస ఇలా వ్రాశారు. "ఆవులు, ఎద్దులు జీవితాంతం సంరక్షించబడతాయి. ఆరోపించిన విధంగా కసాయిలకు విక్రయించబడవు."

Next Story