కవలపిల్లలకు జన్మనిచ్చిన ముఖేశ్ అంబానీ కూతురు ఇషా

Isha Ambani-Anand Piramal Now Parents To Twins. ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త. రిల‌య‌న్స్ చైర్మ‌న్ ముఖేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది.

By M.S.R  Published on  20 Nov 2022 5:29 PM IST
కవలపిల్లలకు జన్మనిచ్చిన ముఖేశ్ అంబానీ కూతురు ఇషా

ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త. రిల‌య‌న్స్ చైర్మ‌న్ ముఖేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఒక బాబు, ఒక పాప జన్మించిన‌ట్లు ఇషా కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆ ఇద్ద‌రు పిల్ల‌ల‌కు అదియా, కృష్ణ అని నామ‌క‌ర‌ణం చేశారు. ఇందుకు సంబంధించి అంబానీ కుటుంబ స‌భ్యులు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇషా, ఆనంద్ పిర‌మిల్ త‌ల్లిదండ్రులు అయ్యార‌నే విష‌యం తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నామని అన్నారు. ఆ దంప‌తుల‌కు న‌వంబ‌ర్ 19న ఇద్ద‌రు క‌వ‌ల‌లు జ‌న్మించారని.. పాప అదియా, బాబు కృష్ణ ఆరోగ్యంగా ఉన్నార‌ని ప్ర‌క‌ట‌న‌లో తెలియజేశారు. అదియా, కృష్ణ‌, ఇషా, ఆనంద్‌కు ఆశీర్వాదంతో పాటు శుభాకాంక్ష‌ల‌ను మీ నుంచి కోరుకుంటున్నామ‌ని తెలిపారు. ఇషా, ఆనంద్‌ లకు 2018లో వివాహ‌మైంది.

We are delighted to share that our children Isha and Anand have been blessed by the Almighty with twins on 19th November 2022. Isha and the babies, baby girl Aadiya and baby boy Krishna are doing well. We seek your blessings and good wishes for Aadiya, Krishna, Isha and Anand in this most important phase of their life.

Nita & Mukesh Ambani

Swati & Ajay Piramal

Piramal & Ambani families..

అంటూ అధికారిక స్టేట్మెంట్ ను ఇరు కుటుంబాలు విడుదల చేశాయి.


Next Story