ఆ పాంత్రాన్ని చేరుకోవాలంటే రివర్స్ డ్రైవింగ్ చేసుకుంటా వెళ్లాల్సిందే. గమ్యస్థానాన్ని చేరుకునేవరకూ ప్రమాదపుటంచున ప్రయాణం చేయాల్సిందే. అదే.. రాజస్థాన్‌లోని నగౌర్ ప్రాంతంలో ఉన్న కుచ్‌మాన్ కోట. 800 సంవత్సరాల క్రితం జలజలీమ్ సింగ్ ఈ కోటను నీటి సంగ్రహణ కోసం నిర్మించారని అక్కడి స్థానికులు చెబుతుంటారు. కోటపై భాగంలో ఇక్కడ వర్షపు నీటిని సేకరించడానికి 17 జాయింట్ ట్యాంకులను నిర్మించారు. ఈ ట్యాంకులు అండర్ గ్రౌండ్ డ్రైన్‌లో కలిసి ఉన్నాయి. అప్పట్లో పైపులను ఉపయోగించేవారు కాదు. అందుకే డిష్, వాటర్ ఫ్రూప్ డ్రయిన్ ద్వారా ఒక ట్యాంకు నుంచి మరొక ట్యాంకుకు వర్షపు నీరు చేరుతుంది. అప్పటి కాలంలోనే ఇంతటి అధునాతన టెక్నాలజీని ఉపయోగించడ ఈ కోటకు మరింత ప్రాముఖ్యతను తెచ్చిపెట్టిందనే చెప్పాలి.
ఏటవాలు ప్రయాణం
అబ్బురపచే నిర్మాణ శైలితో ఉండే ఈ కోట 800 మీటర్ల ఎత్తులో కొండ ప్రాంతంపై ఉంది. ఈ కోట పైకి వెళ్లే కొద్దీ ఏటువాలుగా మారే మార్గంలో వాహనాలను జాగ్రత్తగా రివర్స్ డ్రైవింగ్ చేస్తూ చేరుకోవాలి. ఇక్కడి అధికశాతం విదేశీ పర్యాటకులు వస్తుంటారు. కోటలోపలికి చేరుకునేందుకు అక్కడ ట్రైనింగ్ పొందిన డ్రైవర్లను మాత్రమే లోపలి వరకూ అనుమతిస్తుంటారు. వారిని కూడా సంబంధిత పర్యాటక శాఖ నియమిస్తుంది. ప్రతి క్షణం చాకచక్యంగా వ్యవహరిస్తూ శిక్షణ పొందిన డ్రైవర్లు సందర్శకులకు సహాయపడుతుంటారు. అక్కడకి చేరుకునేందుకు చేసే ఈ ప్రమాదపుటంచున ప్రయాణం జీవితంలో మర్చిపోలనేని అనుభవాన్ని పరిచయం చేస్తుందనే చెప్పాలి.