కేంద్రం గుడ్‌న్యూస్.. విద్యార్థులకు రూ.10వేలు, ఇలా అప్లై చేయండి..
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 4 Aug 2024 6:41 AM IST
కేంద్రం గుడ్‌న్యూస్.. విద్యార్థులకు రూ.10వేలు, ఇలా అప్లై చేయండి..
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇన్స్‌పైర్ అవార్డ్ ఐడియా/ఇన్నోవేషన్ సబ్‌మిషన్ రిజిస్ట్రేషన్‌ని రీ ఓపెన్ చేసింది. స్కూల్ హెడ్‌మాస్టర్ ఇన్‌స్పైర్ అథారిటీగ నమోదు చేసుకోవచ్చు. ఇన్‌స్పైర్ అవార్డుల కోసం ఐడియాలు, ఇన్నోవేషన్స్‌ను సమర్పించవచ్చు. ఇందులో ఐదు భాగాలు ఉంటాయి.ఇన్‌స్పైర్ ఫెలోషిప్, ఇన్‌స్పైర్ ఇంటర్న్‌షిప్, ఇన్‌స్పైర్ అవార్డ్స్ మనక్, ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్, ఇన్‌స్పైర్ ఫ్యాకల్టీ. ఆరో తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి పెంచేందుకు ఈ ప్రోగ్రామ్‌ను కేంద్ర ప్రభుత్వం అలు చేస్తోంది. క్రియేటివ్‌గా ఆలోచించడం, రీసెర్చ్, టెక్నాలజీపై దృష్టి పెడతారిన కేంద్రం అభావిస్తోంది. ఈ అవార్డు కింద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం రూ.10వేలు అందించుంది. అవార్డు కింద ఇచ్చే డబ్బులు క్రియేటివ్ ఆలోచనలకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయతే.. ఇన్‌స్పైర్ అవార్డు కోసం ఐడియాలు, ఇన్నోవేషన్స్‌ను నమోదు చేయడానికి సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.
దేశ వ్యాప్తంగా 720 కంటే ఎక్కువ జిల్లాల్లో ఉన్న 6 లక్షల స్కూళ్లు, 50 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థుల్లో ఇన్‌స్పైర్ ప్రోగ్రాం అద్భుతమైన విజయాన్ని ఆధించింది. ఇప్పటికే 240 మంది జాతీయ విజేతలను కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. 6 నుంచి పదోతరగతి విద్యార్థుల నుంచి ప్రతి ఏడాది 10 లక్షల ఐడియాలను సేకరించి.. క్రియేటివిటీ, ఇన్నోవేషన్లను ప్రోత్సహించడమే ఈ ఇన్‌స్పైర్ మనక్ స్కీమ్ టార్గెట్.
ఇన్స్‌పైర్ అవార్డుకి కావాల్సిన పత్రాలు:
విద్యార్థి ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, అడ్రెస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ నంబర్, లాస్ట్ ఇయర్ మార్క్స్ షీట్, మొబైల్ నంబర్ ఉండాలి.
ఇన్స్‌పైర్ అవార్డును ఏ స్కూల్ వాళ్లు అప్లై చేయొచ్చు:
ఏదైనా గుర్తింపు పొందిన ప్రైవేట్, ప్రభుత్వ లేదా ఫెడరల్ ఫండెడ్ స్కూల్‌లో 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు తమ ఐడియాలు, ఇన్నోవేషన్ లను అధికారిక వెబ్‌సైట్ (https://inspireawards-dst.gov.in/) ద్వారా సమర్పించవచ్చు. గుర్తింపు పొందిన స్కూళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే, ప్రతి విద్యార్థి ఆలోచనలనూ తప్పనిసరిగా సమర్పించాలి.
ఇన్స్‌పైర్ అవార్డుకు ఎలా అప్లై చేసుకోవాలి:
ముందుగా అధికారిక వెబ్‌సైట్ (https://inspireawards-dst.gov.in)ను సందర్శించాలి. అందులో School Authority పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత INSPIRE Award Registration పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ వివరాలు నింపి Submit కొట్టాలి. దాంతో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీరు అప్లికేషన్ నంబర్ పొందుతారు. తర్వాత జిల్లా విద్యాధికారులు అప్రూవ్ చేస్తారు. మీకు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వస్తాయి. ఇప్పుడు లాగిన్ అయ్యి, Student’s Ideas/Innovations Submission లింక్‌పై క్లిక్ చెయ్యాలి. విద్యార్థుల ideas/innovationsని నామినేషన్ కోసం అప్లై చెయ్యాలి. మరిన్ని వివరాలకు 02764-261139, 096384 18605 ఈ నంబర్లకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 లోపు కాల్ చేసి కనుక్కోవచ్చు. లేదంటే inspire@nifindia.orgకి మెయిల్ పంపవచ్చు.