యుద్ధనౌక INS బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం, నీటిలో ఒకరు గల్లంతు
ఇండియన్ నేవీ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 23 July 2024 10:30 AM ISTయుద్ధనౌక INS బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం, నీటిలో ఒకరు గల్లంతు
ఇండియన్ నేవీ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాద ఘటనలో నౌక బాగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఒక నేవీ సిబ్బంది సముద్రంలో గల్లంతు అయ్యాడు. నిర్వహణ పనుల కోసం ముంబై డాక్‌యార్డ్‌లో షిప్ ఉన్న సందర్బంలో ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన జూనియర్ సైలర్ కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. కాగా.. అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత నౌక ఒక వైపు ఒరిగిపోయిందని తెలిపారు.
ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఒక్క జూనియర్ సైలరర్ తప్ప మిగతా అందరినీ రక్షించామని ఫైర్ సిబ్బంది చెప్పారు. గల్లంతైన నావికుడి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందిన పేర్కొన్నారు అధికారులు. మరోవైపు అగ్నిప్రమాద ఘటనపై నేవీ విచారణకు ఆదేశించింది. తాజాగా ఘటనతో కలిసి 11 ఏల్లలో మొత్తం మూడు నౌకలు మునిగిపోయాయి.
కాగా.. దేశీయంగా నిర్మించిన తొలి యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్ర. క్లాస్ గైటెడ్ మిసైల్ ఫ్రిగేట్‌లో తొలి నౌక. ఏప్రిల్ 2000లో దీనిని నేవీలోకి ప్రవేశపెట్టారు. ఇందులో 40 మంది అధికారులు, 330 మంది సైలర్లు ఉంటారు. పొడవు 125 మీటర్లు. 27 నాట్ల వేగంతో ప్రయాణించగలదు.