అమానుష ఘటన.. వృద్దుల‌ను ట్ర‌క్కుల్లోకి ఎక్కించి..

Indore MC official suspended after video of civic staff dumping elderly goes viral.ఉండ‌డానికి చోటు లేక పుట్‌పాత్‌ల‌పై కాలం వెళ్ల‌దీస్తున్న వృద్దుల‌పై మున్సిపాలిటీ సిబ్బంది జులుం ప్ర‌ద‌ర్శించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 Jan 2021 11:24 AM IST
Indore MC official suspended after video of civic staff dumping elderly goes viral.

బ‌ల‌వంతంగా వారిని ట్ర‌కుల్లో ఎక్కించి న‌గ‌ర శివార్ల‌లో వ‌దిలివేశారు. మాన‌వ‌త్వం ఉన్న‌వారిని ఈ ఘ‌ట‌న క‌దిలిస్తోంది. ఇండోర్ మున్సిపాలిటీ సిబ్బంది చేసిన నిర్వాకం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ విష‌యం ముఖ్య‌మంత్రి దృష్టికి వెళ్ల‌డంతో.. త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ న‌గ‌రాన్ని గ్రీన్ సిటీగా మార్చాల‌ని ఇండోర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ నిర్ణ‌యించింది. అందులో భాగంగా పుట్‌పాత్‌ల‌పై నివాసం ఉంటే.. వృద్దుల‌ను త‌ర‌లించాల‌ని అధికారులు భావించారు. అనుకున్న‌దే త‌డ‌వుగా.. పుట్‌పాత్‌ల‌పై నివ‌సిస్తున్న వృద్దుల‌ను మున్సిపాలిటీ సిబ్బంది బ‌ల‌వంతంగా ఓ ట్ర‌క్కులోకి ఎక్కించారు. సిటీ మొత్తం జ‌ల్లెడ ప‌ట్టి పుట్‌పాత్‌నే ఆధారం చేసుకుని బ్ర‌తుకుతున్న వృద్దుల‌ను వాహ‌నంలోకి ఎక్కించి సిటికి దూరంగా ఉండే.. ఓ గ్రామ శివారులో వ‌దిలివేశారు.


చ‌లికి వృద్దులు వ‌ణికిపోతార‌ని తెలిసి కూడా వారిని న‌డిరోడ్డుపైనే దించేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. నెటీజ‌న్లు.. మున్సిప‌ల్ సిబ్బందిపైనే కాకుండా ప్ర‌భుత్వంపైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ విష‌యం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు తెలిసింది. వెంట‌నే ఆ సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇలాంటి చర్యలను సమర్థించమని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ప్రతాప్ సోలంకిని సస్పెండ్ చేసి..తాత్కాలికంగా భోపాల్ అర్బన్ డెవలప్ మెంట్ డైరెక్టరేట్ కు అటాచ్ చేశారు. ఇద్దరు మున్సిపల్ కార్మికులను సర్వీసు నుంచి తొలగించారు. నడిరోడ్డుపై వదిలేసిన ఆ వృద్ధులను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ ఆశ్రమానికి తరలించారు.


Next Story