షార్జా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంలో పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇండిగో ఫ్లైట్ 6ఈ-1406 విమానం ఆదివారం ఉదయం షార్జా నుంచి హైదరాబాద్ బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీన్ని గుర్తించిన ఫైలట్ వెంటనే అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరారు.
దీంతో విమానాన్ని కరాచీకి మళ్లించారు. కరాచీలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా.. ప్రయాణీకులను హైదరాబాద్‌కు తరలించేందుకు మరో విమానాన్ని కరాచీకి పంపినట్లు ఇండో సంస్థ వెల్లడిచింది.
కాగా.. భారత్‌కు చెందిన విమానాలు కరాచీలో అత్యవసరంగా ల్యాండవడం గత రెండువారల్లో ఇది రెండోసారి. జూలై 5న ఢిల్లీ నుంచి దుబాయ్ వెలుతున్న స్పైస్‌జెట్ విమానం కూడా పాక్‌లోని కరాచీకి మళ్లించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బోయింగ్ 737 రకానికి చెందిన స్పైస్‌జెట్ విమానంలో 138 మంది ప్రయాణీకులు ఉన్నారు.