ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఇండియన్ రైల్వే వ్యవస్థ ఒకటి. భారతీయ రైల్వే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 295 వేగన్లతో ఐదు రైళ్లను అనుసంధానించి మరీ నడిపించి హ్యాట్సాఫ్ అనిపించింది. దీనికి 'వాసుకి' అని పేరు పేట్టింది.
సౌత్ ఈస్ట్ రైల్వే( SECR) చేపట్టిన సరికొత్త ప్రయోగం భారతీయ రైల్వే సామర్థానికి మచ్చుతునకగా నిలిచింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు రైళ్లను ఒకదానికొకటి అనుసంధానించి ఛత్తీస్‌గడ్‌కు చెందిన బిలాయ్ నుంచి అదే రాష్ట్రంలోని కోర్భా వరకు విజయవంతంగా నడిపించింది. ఈ రెండు సేషన్ల మధ్య దాదాపు 224 కిలో మీటర్ల దూరం ఉంటుంది. అనుసంధానించిన తరువాత ఈ రైలు పొడవు 3.5 కి.మి. దీనిలో సరుకు రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ గూడ్స్ రవాణా చేసేందుకే ఈ వాసుకి ని చేపట్టినట్లు చెప్పారు.
కాగా.. గతంలో 177 వేగన్లతో మూడు గూడ్స్ రైళ్లను అనుసంధానించి నడిపారు. దీనికి 'సూపర్ అనకొండ' అనే పేరు పెట్టారు. బిలాస్ పూర్ నుంచి చక్రధర్ పూర్ డివిజన్ల మీదుగా ఈ అనకొండ గూడ్స్ రైలు సాగింది. మొత్తం 177 వేగన్లతో కూడిన మూడు గూడ్స్ రైళ్లను.. ఒక్కొక్కటి 6 వేల హెచ్ పీ సామర్ధ్యం కలిగిన ఇంజన్లతో నడిపింది సౌత్ ఈస్ట్ రైల్వే.