రైల్వేలో 32,438 గ్రూప్-డి ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియాల్సి ఉండగా ఆర్‌ఆర్‌బీ మరో వారం రోజులు పొడిగించింది. మార్చి 1 వరకు అప్లై చేసుకోవచ్చు. 4 నుంచి 13 వరకు కరెక్షన్ విండో ఓపెన్‌లో ఉంటుంది. టెన్త్/ ఐటీఐ పాసై, 18 నుంచి 36 ఏళ్ల వయస్సు వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక ఉంటుంది. దరఖాస్తు కోసం http://www.rrbcdg.gov.in/ ఇక్కడ క్లిక్ చేయండి.
పోస్టులు ఇవే: పాయింట్స్‌మన్-బి- 5058, అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్)- 799, అసిస్టెంట్ (బ్రిడ్జ్)- 301, ట్రాక్ మెయింటెయినర్ Gr. IV- 13187, అసిస్టెంట్ పి-వే - 247 అసిస్టెంట్ (C&W)- 2587, అసిస్టెంట్ TRD -1381, అసిస్టెంట్ (S&T)- 2012, అసిస్టెంట్ లోకో షెడ్ (డీజిల్)- 420, అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్)- 950, అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్)- 744, అసిస్టెంట్ TL & AC- 1041, అసిస్టెంట్ TL & AC (వర్క్‌షాప్)- 624, అసిస్టెంట్ (వర్క్‌షాప్) (మెక్)- 3077