రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. 45 పైసలకే రూ.10 లక్షల బీమా

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ తన కొత్త ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలో కీలక మార్పులు చేసింది. ఇందులో బీమా ప్రీమియం ప్రయాణికుడికి 45 పైసలుగా నిర్ణయించింది.

By అంజి
Published on : 11 Nov 2024 1:45 PM IST

Indian Railway Catering and Tourism Corporation, travel insurance policy, Train ticket booking

రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. 45 పైసలకే రూ.10 లక్షల బీమా

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ తన కొత్త ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలో కీలక మార్పులు చేసింది. ఇందులో బీమా ప్రీమియం ప్రయాణికుడికి 45 పైసలుగా నిర్ణయించింది. రైలు ప్రయాణం చేసేవారికి ఇది తప్పనిసరి. ఈ బీమా ఐఆర్‌సీటీసీ ద్వారా ఈ - టికెట్లను బుక్‌ చేసుకునే భారతీయ పౌరులకు మాత్రమే. సీటు లేకుండా టికెట్లు బుక్‌ చేసుకునే ఐదేళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలను ఈ బీమాలో చేర్చలేదు. కానీ 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు టికెట్‌ బుక్‌ చేసినట్టయితే ఈ బీమా వర్తిస్తుంది. ఈ బీమా గురించి మరిన్ని వివరాలు మీ కోసం..

సమ్‌ ఆష్యూర్డ్‌, బెనిఫిట్స్‌: ఇన్సూరెన్స్‌ పాలసీ కింద బీమా డబ్బు నాలుగు వర్గాలుగా విభజించారు.

మృతదేహం తరలింపు: రైలు ప్రమాదం లేదా ఇతర సంఘటనల తర్వాత మృతదేహాన్ని తరలించడానికి రూ.10 వేల వరకు బీమా ప్రయోజనం పొందొచ్చు.

గాయం కోసం హాస్పిటలైజేషన్‌ ఖర్చులు: ఈ ప్లాన్‌లో రైలు ప్రమాదంలో గాయాలైనప్పుడు ఆస్పత్రిలో చేర్చే ఖర్చుల కోసంరూ.2 లక్షల వరకు బుఈమా ప్రయోజనం ఉంటుంది.

పాక్షిక వైకల్యం: బీమా ప్రయోజనం 75 శాతం అందిస్తారు. ఇది రూ.7,50,000 వరకు ఉండవచ్చు.

శాశ్వత వైకల్యం: ప్రమాదం జరిగినప్పుడు శాశ్వతంగా వైకల్యం చెందినట్టయితే 100 శాతం బీమా మొత్తం అందుతుంది. ఇది రూ.10 లక్షల వరకు ఉంటుంది.

మరణం: ప్రయాణంలో ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి బీమా మొత్తంలో 100 శాతం లభిస్తుంది. అంటే రూ.10 లక్షల వరకు లభిస్తుంది.

బీమా పొందడం ఎలాగంటే..

రైల్వే టికెట్‌ బుక్‌ చేసుకున్నప్పుడు ఎస్‌ఎంఎస్‌, ఈ మెయిల్‌ ద్వారా ప్రయాణికుడికి బీమా సమాచారం అందుతుంది. ప్రయాణికులు వారి టికెట్‌ బుకింగ్‌ పాలసీలో నెంబర్‌, ఇతర సమాచారాన్ని తనిఖీ చేయవచ్చు. బీమా కంపెనీ వెబ్‌సైట్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత నామినీ వివరాలు పూరించాల్సి ఉంటుంది. నానినేషన్‌ సమాచారం నింపకపోతే క్లెయిమ్‌ విషయంలో చట్టపరమైన వారసులకు చెల్లింపు ఉంటుంది. ఈ బీమా పాలసీ ధృవీకరించిన ఆర్‌ఏసీ టికెట్ హోల్డర్లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రయాణ సమయంలో ప్రమాదాలు లేదా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ప్రయాణికులను రక్షించేందుకు ఈ పాలసీని రూపొందించారు.

Next Story