పాక్ బంకర్లపై భారత్ మెరుపు దాడి.. వీడియో రిలీజ్
Indian Missiles..Pakistan bunkers destroyed .. పాకిస్థాన్‌కు భారత్ ధీటైన జవాబు ఇచ్చింది. పాక్ కాల్పులకు ధీటుగా
By సుభాష్
పాకిస్థాన్‌కు భారత్ ధీటైన జవాబు ఇచ్చింది. పాక్ కాల్పులకు ధీటుగా బదులిచ్చింది. పాక్ భూ భాగంలోని ఉగ్రస్థావరాలను కూడా భారత్ ఆర్మీ ధ్వంసం చేసింది. భారత్ దెబ్బకు పాక్‌కు దిమ్మదిరిగినట్లయింది. వాస్తవాధీన రేఖ వెంట పలు పాక్ పోస్టులను భరత్ జవాన్లు ధ్వంసం చేసిన వీడియోలు బయటకు వచ్చాయి. భారత్‌నే ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ధ్వంసం చేసిన వాటిలో పాక్ ఆయుధ సామాగ్రిని కలిగివున్న ప్రదేశం, ఆయిల్ నిల్వల బిల్డింగ్, వాస్తవాధీన వెంట చొరబడేందుకు ఉగ్రవాదులకు సహాయంగా పాక్ సిద్దంగా ఉంచిన లాంచ్‌ప్యాడ్‌లున్నాయి.
అయితే ఇండియన్ ఆర్మీ షేర్ చేసిన వీడియోలో పాక్ భూభాగంలోని ఓ బంకర్ లక్ష్యంగా ఆర్మీ ఓ మిసైల్ ఫైర్ చేయడంతో ఓ పాక్ జవాను తనను కాపాడుకునేందుకు పరుగు తీస్తున్నట్లు కనిపిస్తోంది. భారత ఆర్మీ వదిలిన మిసైల్ నేరుగా పాక్ బంకర్‌ను ఢీకొట్టగా, వెంటనే మరో రెండు మిసైల్‌ను వదిలింది భారత ఆర్మీ.
సరిహద్దు వెంబడి కాల్పుల విరమణను పాక్ పదేపదే ఉల్లంఘిస్తోంది. ఎన్ని సార్లు బుద్ది చెప్పినా.. తీరు మార్చుకోడం లేదు. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పుల విమరణ ఒప్పందానికి తూట్లు పొడిగించి. ఎల్‌వోసీ వెంబడి పాక్ ఆర్మీ భారత జవాన్లపై దాడులకు తెగబడుతోంది. తాజాగా జరిగిన కాల్పుల్లో భారత్‌కు చెందిన ఇద్దరు జవాన్లతో పాటు నలుగురు పౌరులు అమరులయ్యారు. అంతేకాకుండా అందుకు ధీటుగా భారత ఆర్మీ జవాబు ఇవ్వడంతో పాక్‌కు చెందిన 8 మంది జవాన్లు హతం అయ్యారు. ఈ ఘటనలో మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ఆర్మీ. పాక్ సైన్యానికి చెందిన స్థావరాలను సైతం భారత ఆర్మీ కూల్చివేసింది. మరో వైపు ఈ కాల్పుల్లో పలు ఇళ్లు సైతం ధ్వంసం అయ్యాయి. పాక్ దుశ్చర్యపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
#IndianArmy Hitting enemies hard #PakistanArmy soldier seen running pic.twitter.com/HNIiCeRlFn
— Utkarsh Singh (@utkarshs88) November 13, 2020