దుబాయ్‌లో దారుణం.. పాకిస్థానీ రూమ్‌మేట్స్‌చే భారతీయ వ్యక్తి హత్య

భారత్‌కు చెందిన 21 ఏళ్ల వ్యక్తిని దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో అతని పాక్ రూమ్‌మేట్‌లు మాటల వాగ్వాదం తర్వాత హత్య చేశారు.

By అంజి  Published on  11 July 2024 5:30 PM IST
Indian man killed, Dubai, Pakistani roommates, argument

దుబాయ్‌లో దారుణం.. పాకిస్థానీ రూమ్‌మేట్స్‌చే భారతీయ వ్యక్తి హత్య

భారతదేశంలోని పంజాబ్‌లోని లూథియానా జిల్లాలోని లోహత్‌బడ్డీ గ్రామానికి చెందిన 21 ఏళ్ల వ్యక్తిని దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో అతని పాక్ రూమ్‌మేట్‌లు మాటల వాగ్వాదం తర్వాత హత్య చేశారు. బాధితుడిని 2023లో ఫార్మాస్యూటికల్ కంపెనీలో కూలీగా పని చేసేందుకు దుబాయ్ వెళ్లిన మంజోత్ సింగ్‌గా గుర్తించారు. మన్‌జోత్ తండ్రి దిల్‌బాగ్ సింగ్ తన కొడుకును విదేశాలకు పంపించేందుకు ఫైనాన్షియర్లు, బంధువుల నుంచి రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.

ఈ సంఘటన జూన్ 21 న జరిగింది. అయితే బాధితుడు.. వారి ఫోన్‌ కాల్‌లకు సమాధానం ఇవ్వడం మానేసిన తర్వాత ఈ ఘటన గురించి కుటుంబానికి తెలిసింది. దిల్‌బాగ్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. కొన్ని సమస్యలపై పాకిస్తాన్ పురుషులు తన కొడుకు, స్నేహితుడిపై కత్తి, ఇతర పదునైన ఆయుధాలతో దాడి చేశారని చెప్పారు. మంజోత్ అక్కడికక్కడే మృతి చెందగా, అతని స్నేహితుడు దాడిలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం దుబాయ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

జూలై 12, శుక్రవారం నాడు మంజోత్ మృతదేహం లూథియానాకు చేరుకునే అవకాశం ఉందని సమాచారం.

Next Story