63 పోర్న్ సైట్‌లను నిషేధిస్తూ.. భారత ప్రభుత్వం ఉత్తర్వులు

Indian government orders banning 63 porn sites.భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు అశ్లీల వెబ్‌సైట్‌లను నిషేధిస్తూనే ఉంది. 2018లో ఇటువంటి అనేక సైట్‌లను బ్యాన్

By అంజి  Published on  30 Sep 2022 9:35 AM GMT
63 పోర్న్ సైట్‌లను నిషేధిస్తూ.. భారత ప్రభుత్వం ఉత్తర్వులు

భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు అశ్లీల వెబ్‌సైట్‌లను నిషేధిస్తూనే ఉంది. 2018లో ఇటువంటి అనేక సైట్‌లను బ్యాన్ చేసిన తర్వాత, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) తాజాగా.. 67 ఇతర పోర్న్‌ సైట్‌లపై నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రూల్స్, 2021 ఉల్లంఘించినట్లు గుర్తించిన తర్వాత రెండు హైకోర్టుల తీర్పుల ఆధారంగా ఈ ఆదేశాలు వచ్చాయి. 67 అశ్లీల వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని డాట్‌ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను కోరింది. వాటిలో 63 వెబ్‌సైట్లును బ్లాక్‌ చేయాలని పూణే కోర్టు ఆదేలివ్వగా, ఉత్తరాఖండ్ హైకోర్టు 2018 తీర్పు, ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఐటీ ఆదేశాలకు అనుగుణంగా నాలుగు వెబ్‌సైట్‌లను బ్లాక్‌ చేయాలని టెలికం శాఖ ఇంటర్నెట్‌ కంపెనీలను కోరింది.

"క్రింద పేర్కొన్న వెబ్‌సైట్‌లో స్త్రీల నిరాడంబరతకు మచ్చ తెచ్చే కొన్ని అశ్లీల విషయాలను దృష్టిలో ఉంచుకుని, వెంటనే వెబ్‌సైట్‌లు/URLలను తీసివేయాలని ఆదేశించింది" అని సెప్టెంబర్ 24 నాటి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆర్డర్ పేర్కొంది. మూడేళ్ల క్రితం ప్రభుత్వం 850 అశ్లీల కంటెంట్ సంబంధిత వెబ్ సైట్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ఐటీ నియమం ప్రకారం.. వ్యక్తిని పూర్తిగా లేదా పాక్షికంగా నగ్నంగా చూపించే, ఏదైనా లైంగిక చర్యలో పాల్గొన్న వ్యక్తిని చూపించే కంటెంట్‌ను నిషేధిస్తుంది.




Next Story