ఏడాదిలోగా టోల్‌ప్లాజాలు తొల‌గిస్తాం.. నితిన్ గ‌డ్క‌రీ

India will do away with toll booths within one-year says Nitin Gadkari. టోల్ ప్లాజాల స్థానంలో పూర్తి జీపీఎస్ ఆధారిత టోల్ సేకరణను తీసుకొస్తున్నామని అన్నారు.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 18 March 2021 8:36 PM IST

India will do away with toll booths within one-year says Nitin Gadkari.

భారతదేశంలో టోల్ గేట్స్ విషయంలో భారతీయ జనతా పార్టీ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వెళుతోంది. ఇప్పటికే చాలా వరకూ వాహనాలకు ఫాస్టాగ్ వేయించేస్తూ ఉన్నారు. టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపు రుసుమును సులభతరం చేసేందుకు ఫాస్ట్ ట్యాగ్స్ వ్యవస్థను 2016లో ప్రవేశపెట్టారు. 2021 ఫిబ్రవరి 16 నుంచి వాహనాలకు దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థను తప్పనిసరి చేసింది. ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే టోల్ ప్లాజాలలో రెట్టింపు టోల్ ఫీజు చెల్లించాలి. ఫాస్టాగ్ లేకుండా హైవే మీద వెళ్లాలంటే పెద్ద ఎత్తున చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని ప్రణాళికలు ఉన్నాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గతంలోనే చెప్పి ఉండగా.. తాజాగా లోక్ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్‌ప్లాజాలను పూర్తిగా తొలగిస్తామని నితిన్‌ గడ్కరీ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. టోల్ ప్లాజాల స్థానంలో పూర్తి జీపీఎస్ ఆధారిత టోల్ సేకరణను తీసుకొస్తున్నామని అన్నారు. ఒక సంవత్సరంలో దేశంలోని అన్ని టోల్‌ ప్లాజాలు తొలగిస్తామని సభా వేదికగా హామీ ఇస్తున్నా. అంటే ఇకపై జీపీఎప్‌ ఆధారంగా టోల్‌ వసూళ్లు చేపట్టనున్నాం. వాహనానికి ఉన్న జీపీఎస్‌ ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్‌ మొత్తాన్ని మినహాయించుకునే కొత్త వ్యవస్థను తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 93 శాతం వాహనాలు ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగించి టోల్ చెల్లిస్తున్నారని.. మిగిలిన 7 శాతం మంది రెట్టింపు టోల్ చెల్లిస్తున్నప్పటికీ ఇంకా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోలేదని అన్నారు. ఫాస్ట్ ట్యాగ్స్ ఉపయోగించి టోల్ చెల్లించని వాహనాల కోసం పోలీసు విచారణకు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. వాహనాల్లో ఫాస్ట్‌ట్యాగ్‌లు అమర్చకపోతే టోల్ దొంగతనం, జీఎస్టీ ఎగవేత కేసులు పెట్టనున్నట్లు తెలిపారు.


Next Story