టిక్‌టాక్ స‌హా 59 చైనా యాప్‌ల‌పై శాశ్వత నిషేధం..!

India to permanently ban 59 Chinese apps including tiktok. .టిక్‌టాక్ స‌హా చైనాకు చెందిన 59 యాప్‌ల‌పై శాశ్వత నిషేధం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jan 2021 12:06 PM IST
India to permanently ban 59 chinese apps including tiktok

దేశ స‌మ‌గ్ర‌త‌, సార్వ‌భౌమాధికారం, రక్ష‌ణ, భ‌ద్ర‌త, ప్ర‌యోజ‌నాల దృష్ట్యా గ‌తేడాది జూన్‌లో టిక్‌టాక్ స‌హా చైనాకు చెందిన 59 యాప్‌ల‌పై భార‌త ప్ర‌భుత్వం తాత్కాలిక నిషేదం విధించిన సంగ‌తి తెలిసిదే. ఇక తాజాగా ఆ యాప్‌ల‌పై కేంద్రం శాశ్వతంగా నిషేదం విదించ‌నుంది. ఈమేర‌కు సంబంధిత యాప్‌ల‌ను శాశ్వ‌తంగా నిషేదించ‌నున్న‌ట్లు తెలుపుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

భార‌తీయుల డేటా సేక‌రించి ఈ యాప్‌లు దుర్వినియోగం చేస్తున్నాయ‌న్న ఆరోప‌ణ‌ల‌తో గతేడాది కేంద్రం వీటిపై తాత్కాలిక నిషేదం విదించింది. ఆ త‌ర్వాత స‌ద‌రు సంస్థ‌ల నుంచి వివ‌ర‌ణ కోరింది. వాళ్లు ఇచ్చిన వివ‌ర‌ణ‌తో సంతృప్తి చెంద‌ని ప్ర‌భుత్వం.. వాటిని శాశ్వ‌తంగా నిషేధించాల‌ని నిర్ణ‌యించినట్లు స‌మాచారం. ఇప్ప‌టికే 200కుపైగా చైనీస్ యాప్స్‌పై ప్ర‌భుత్వం నిషేధించిన విష‌యం తెలిసిందే. అందులో పాపుల‌ర్ గేమ్ ప‌బ్‌జీ కూడా ఒక‌టి. ఈ గేమ్ పూర్తిగా ఇండియ‌న్ వ‌ర్ష‌న్‌తో, కొత్త ప్రైవ‌సీ పాల‌సీతో ప‌బ్‌జీ ఇండియాగా మ‌ళ్లీ రాబోతోంద‌న్న వార్త‌లు వ‌చ్చినా.. ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యంతో ఈ గేమ్ మ‌ళ్లీ లాంచ్ అయ్యేది సందేహంగా మారింది.

ఇటీవ‌లే మ‌రోసారి స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. మూడు రోజుల క్రితం భార‌త్‌లో చొర‌బడేందుకు సిక్కిం సెక్టార్‌లోని నాథూలా స‌మీపంలోని లైన్ ఆప్ యాక్సువ‌ల్ కంట్రోల్‌(ఎల్ఏసీ) వ‌ద్ద చైనా సైనికులు య‌త్నించ‌గా.. భార‌త జ‌వాన్లు స‌మ‌ర్థ‌వంతంగా ఆచ‌ర్య‌ను తిప్పికొట్టారు. ఓ ప‌క్క చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గా.. స‌రిహ‌ద్దు ద‌గ్గ‌ర తోక జాడిస్తున్న డ్రాగ‌న్‌పై యాప్‌ల శాశ్వ‌త నిషేదంతో.. ఇండియా డిజిట‌ల్ దెబ్బ కొట్టిన‌ట్లైంది.




Next Story