అగ్ని-ప్రైమ్ క్షిప‌ణి ప్ర‌యోగం విజ‌య‌వంతం

India Successfully Test Fires Agni Prime.డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) అణ్వాయుధ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jun 2021 9:24 AM GMT
అగ్ని-ప్రైమ్ క్షిప‌ణి ప్ర‌యోగం విజ‌య‌వంతం

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) అణ్వాయుధ సామ‌ర్థ్యం క‌లిగిన ఆధునిక‌ అగ్నిప్రైమ్ క్షిప‌ణిని నేడు(సోమ‌వారం) విజ‌య‌వంతంగా ప్ర‌యోగించింది. అగ్ని మిస్సైల్ సిరీస్‌లో భాగ‌మైన అగ్ని ప్రైమ్‌ను ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల 55 నిమిషాల‌కు ఒడిశా తీరంలో ప‌రీక్షించారు. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిప‌ణి అయిన ఇది 1,000 కిలో మీటర్ల నుంచి 2,000 కిలో మీటర్ల దూరం వరకు దూసుకపోయే సామర్థ్యం గలది. 1000 కిలోల వ‌ర‌కు అణ్వాయుధాల‌ను మోసుకెళ్ల‌గ‌ల సామ‌ర్థ్యం దీని సొంతం. చాందీపూర్‌లోని నాలుగ‌వ లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని ప్ర‌యోగించారు.

"తూర్పు తీరం వెంబడి ఉన్న పలు టెలిమెట్రీ, రాడార్ స్టేషన్లు క్షిపణి ప్రయోగాలను క్షుణ్ణంగా ట్రాక్ చేసి పర్యవేక్షించాయి. క్షిపణి ఓ క్రమపద్ధతిని అనుసరించి అన్ని లక్ష్యాలను ఖచ్చితత్వంతో చేరుకుందని" డీఆర్‌డీవో ఒక ప్రకటనలో తెలిపింది.

దీంట్లో ఎన్నో అడ్వాన్స్ ఫీచ‌ర్లు ఉన్నాయి. ఈ క్షిప‌ణి అగ్ని-1 కంటే తేలిక‌గా ఉండ‌డం విశేషం. 4000కి.మీ రేంజ్ క‌లిగిన అగ్ని-4, 5000కి.మీ రేంజ్ క‌లిగిన అగ్ని-5 ఫీచ‌ర్ల‌ను సైతం అగ్నిప్రైమ్‌లో మిళితం చేశారు. అగ్ని-1 బలాస్టిక్ మిస్సైల్‌ను ఇండియాలో తొలిసారి 1989లో ప‌రీక్షించారు. 2004లో ఆ క్షిప‌ణుల‌ను వినియోగంలోకి తెచ్చారు.

Next Story