దేశానికి నాలుగు రాజధానులు కావాలని అంటున్న మమతా..!

India Should Have 4 Capitals On Rotational Basis. భారతదేశానికి నాలుగు రొటేటింగ్‌ రాజధానులు ఉండాలని పశ్చిమబెంగాల్

By Medi Samrat
Published on : 23 Jan 2021 6:48 PM IST

దేశానికి నాలుగు రాజధానులు కావాలని అంటున్న మమతా..!

భారతదేశానికి నాలుగు రొటేటింగ్‌ రాజధానులు ఉండాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతాను రాజధానిగా చేసేకొని అప్పట్లో ఆంగ్లేయులే పాలించారని, అలాంటప్పుడు దేశవ్యాప్తంగా ఒకే రాజధాని ఎందుకు ఉండాలని ఆమె ప్రశ్నించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నేతాజీ జయంతిని పురస్కరించుకొని కేంద్రం జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ఆమె డిమాండ్‌ చేశారు. దేశ్‌నాయక్‌ దివాస్‌గా జరుపుకునే నేతాజీ పుట్టిరోజు గురించి మనందరికీ తెలిసినా, ఆయన మరణం గురించి మాత్రం ఎవరికీ తెలియదని అన్నారు. రాజర్హట్ ప్రాంతంలో ఆజాద్ హిందూ ఫౌజ్ ను నిర్మిస్తామని ప్రకటించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరిట విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తామని, దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచే నిధులు ఇస్తామని తెలిపారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని.. ప్రధాని నరేంద్ర మోదీ కోల్ కతా పర్యటన కన్ఫర్మ్ అవ్వగా.. ప్రధాని పర్యటనకు ముందే మమతా బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహించారు. శ్యాం బజార్ నుంచి రెడ్ రోడ్ వరకు పాదయాత్ర చేశారు. నేతాజీకి ఘన నివాళులు అర్పించారు. పాదయాత్రలో మమతకు తోడుగా వేలాది మంది తరలివచ్చారు.


Next Story