దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 19,55,910 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 38,949 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,10,26,829కి చేరింది. నిన్న ఒక్క రోజే 542 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,12,531 కి పెరిగింది.
నిన్న40,026 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,01,83,876 చేరింది. ప్రస్తుతం దేశంలో 4,30,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.28శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.14శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.99 శాతానికి తగ్గిందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 38,78,078 లక్షల మందికి టీకా అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 39,53,43,767 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.