భారత్‌లో కరోనా ఉద్దృతి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 19,25,374 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 1,27,510 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,75,044కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 2,795 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,31,895 లకు చేరింది. నిన్న 2,55,287 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,59,47,629 కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 18,95,520 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 92.09శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 8.64 శాతంగా ఉందని.. రోజువారీ పాజిటివిటీ రేటు 6.62శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. టీకా డ్రైవ్‌లో 21,60,46,638 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది.