దేశంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వరుసగా రెండో రోజు కూడా లక్షకు దిగువకు కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 19,85,967 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 92,596 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,89,069 కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,219 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,53,528 లకు చేరింది. నిన్న 1,62,664 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,75,04,126 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 12,31,415 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రికవరీ రేటు 94.29శాతానికి చేరింది. టీకా డ్రైవ్‌లో 23,90,58,360 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది.