దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా రోజువారి పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,23,03,131కి చేరింది. నిన్న ఒక్క రోజే 469 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మహమ్మారి దేశంలో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,63,396కి చేరింది.
నిన్న ఒక్క రోజే 50,356 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,23,03,131కు చేరింది. దేశంలో ప్రస్తుతం 6,14,696 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో నిన్నటి వరకు మొత్తం 24,59,12,587 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. మహారాష్ట్రను కరోనా పట్టి పీడిస్తోంది. దేశ వ్యాప్తంగా బయట పడుతున్న కేసుల్లో సగానికి పైగా ఆరాష్ట్రంలోనే వెలుగుచూస్తున్నాయి. నిన్న ఒక్క రోజే 43,183 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా..249 మంది మృత్యువాత పడ్డారు. ఇక దేశ వ్యాప్తంగా 6,87,89,138 మందికి వ్యాక్సిన్లు వేశారు