దేశంలో క‌రోనా తీవ్ర‌రూపం.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

India reports 72330 new corona cases.భార‌తలో గ‌డిచిన 24 గంట‌ల్లో 11,25,681 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 72,330 మందికి పాజిటివ్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2021 12:05 PM IST
India reports 72330 new corona cases

భార‌త దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌రూపం దాల్చుతోంది. గ‌త‌కొద్ది రోజులుగా క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 11,25,681 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 72,330 మందికి పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 1,22,21,665కి చేరింది. నిన్న ఒక్క రోజే 459 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి మృత్యువాత ప‌డిన వారి సంఖ్య 1,62,927కి చేరింది. నిన్న ఒక్క రోజే 40,382 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,14,74,683కి చేరింది.

ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 5,84,055 గా ఉంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 24,47,98,621 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించారు. ఇక నేటి నుంచి దేశ వ్యాప్తంగా 45 ఏళ్లు పైబ‌డిన వారికి కూడా టీకాలు ఇవ్వ‌నున్నారు. నిన్న 20,63,543 మందికి కేంద్రం టీకా డోసుల‌ను పంపిణీ చేసింది. మార్చి 31 నాటికి 6,51,17,896 మంది టీకాలు అందాయ‌ని తెలిపింది.




Next Story