క‌రోనా అప్‌డేట్‌.. కొత్త కేసులు ఎన్నంటే

India Reports 6396 new covid infections.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి అదుపులోకి వ‌స్తోంది. రోజువారి కేసుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2022 4:57 AM GMT
క‌రోనా అప్‌డేట్‌.. కొత్త కేసులు ఎన్నంటే

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి అదుపులోకి వ‌స్తోంది. రోజువారి కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో 9ల‌క్ష‌ల‌ మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 6,396 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,29,51,556కి చేరింది. నిన్న 201 ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,14,589కి చేరింది.

ఒక్క రోజులో 13,450 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 4,23,67,070కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 69,897 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రిక‌వ‌రీ రేటు 98.64 శాతానికి చేరింది. రోజువారి పాజిటివిటీ రేటు కూడా 0.69 శాతంగా న‌మోదు అయింది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. నిన్న 24,84,412 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 1,78,29,13,060 డోసుల‌ను పంపిణీ చేశారు.

Next Story