స్వల్పంగా తగ్గిన కేసులు.. ఎన్నంటే..?
India reports 62480 new covid-19 cases in last 24 hours.నిన్నటితో పోలిస్తే నేడు కరోనా పాజిటివ్ కేసుల
By తోట వంశీ కుమార్ Published on 18 Jun 2021 4:44 AM GMTనిన్నటితో పోలిస్తే నేడు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 19,29,476 శాంపిళ్లను పరీక్షించగా.. 62,480 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,62,793కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,587 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes @PIB_India @mygovindia @COVIDNewsByMIB #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/RD4SMkwj1C
— ICMR (@ICMRDELHI) June 18, 2021
దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,83,490 కి పెరిగింది. నిన్న 88,977 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,85,80,647కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 7,98,656 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ రికవరీ రేటు ప్రస్తుతం 96.03 శాతానికి పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 5 శాతాని కంటే తక్కువగా ఉందని, ప్రస్తుతం 3.80 శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉందని.. వరుసగా 11వ రోజు శాతానికన్నా తక్కువగా ఉందని వివరించింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 26,89,60,399కి చేరింది.