స్వల్పంగా పెరిగిన కేసులు.. కొత్తగా ఎన్నంటే..?
India reports 62224 new covid 19 cases in last 24 hours.నిన్నటితో పోలిస్తే నేడు దేశంలో కరోనా కేసులు స్వల్పంగా
By తోట వంశీ కుమార్
నిన్నటితో పోలిస్తే నేడు దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 19,30,987 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 62,224 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,33,105కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,542 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes @PIB_India @mygovindia @COVIDNewsByMIB #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/ShwkFsJPVx
— ICMR (@ICMRDELHI) June 16, 2021
దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,79,573కి పెరిగింది. నిన్న 1,07,628 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,83,88,100 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 8,65,432 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 95.80శాతానికి పెరిగిందని మంత్రిత్వశాఖ చెప్పింది. వ్లీకీ ప్లాజిటివిటీ రేటు ఐదు శాతానికి కన్నా తక్కువకు పడిపోయిందని, ప్రస్తుతం 4.17శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 3.22శాతంగా ఉందని చెప్పింది. వరుసగా తొమ్మిదో రోజు ఐదో శాతానికన్నా తక్కువగా ఉందని చెప్పింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 26 కోట్లు దాటింది.