భారత్ కరోనా అప్డేట్.. 75 రోజుల కనిష్ఠానికి కేసులు
India reports 60471 new covid 19 cases in last 24 hours.దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో
By తోట వంశీ కుమార్ Published on 15 Jun 2021 9:58 AM ISTదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 17,51,358 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 60,471 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. రోజువారి కరోనా కేసులు 75 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయనని పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,70,881కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,726 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes @PIB_India @mygovindia @COVIDNewsByMIB #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/j1nU7ybnXO
— ICMR (@ICMRDELHI) June 15, 2021
దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,77,031కి పెరిగింది. నిన్న 1,17,525 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,82,80,472 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 9,13,378 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 95.64శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 5శాతానికన్నా తక్కువకు పడిపోయిందని.. 4.39శాతంగా ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది. రోజువారి పాజిటివిటీ రేటు 3.45శాతంగా ఉందని, వరుసగా ఎనిమిదో రోజు 5శాతానికన్నా తక్కువగా ఉందని వివరించింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 25,90,44,072 టీకా డోసులు అందించారు.