దేశంలో కొత్త‌గా 56,211 పాజిటివ్ కేసులు

India reports 56211 new corona cases.దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 56,211 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 March 2021 4:50 AM GMT
India reports 56211 new corona cases

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రత కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 56,211 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని కేంద్ర కుటుంబ‌, ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,20,95,855కి చేరింది. నిన్న ఒక్క రోజే 271 మంది మృత్యువాత ప‌డ‌గా.. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,62,114కి చేరింది. తాజాగా 27,028 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,13,93,021 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 5,40,720 యాక్టివ్‌ కేసులున్నాయి. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 6,11,13,354 డోసులు వేసినట్లు వివరించింది. ఇదిలా ఉండగా.. సోమవారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 7,85,864 కొవిడ్‌ పరీక్షలు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 24,26,50,025 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వివరించింది.


Next Story