దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,22,915 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 53,480 కొత్త కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదు అయిన కేసుల సంఖ్య 1,21,49,335కి చేరింది. నిన్న కరోనా మహమ్మారి కారణంగా 354 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,62,468కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 41,280 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
దీంతో ఇప్పటి వరకు కోలుకున్నా వారి సంఖ్య 1,14,34,301కి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5,52,566 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో నిన్నటి వరకు మొత్తం 24,36,72,940 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 6,30,54,353 మందికి వ్యాక్సిన్లు వేశారు.