భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 17,45,809 శాంపిళ్లను పరీక్షించగా.. 48,698 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,83,143కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,183 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,94,493కి పెరిగింది.
నిన్న 64,818 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,91,93,085కి పెరిగింది. 86 రోజుల తర్వాత ఆరు లక్షలకు దిగువకు క్రియాశీల కేసులు చేరుకున్నాయని, ప్రస్తుతం దేశంలో 5,95,656 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ రికవరీ రేటు 96.72 శాతానికి పెరిగిందని, వ్లీకీ పాజిటివిటీ రేటు 2.97 శాతంగా ఉందని చెప్పింది. వరుసగా 19 రోజులు రోజువారీ పాజిటివిటీ రేటు 2.79 శాతానికి పడిపోయిందని తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 31.50కోట్ల పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.