భారత్ కరోనా అప్‌డేట్.. నాలుగు లక్షలు దాటిన మరణాలు
India Reports 46617 Newcovid-19 cases in last 24 hours.దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన
By తోట వంశీ కుమార్ Published on
2 July 2021 4:40 AM GMT

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 18,80,026 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 46,617 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,04,58,251కి చేరింది. నిన్న ఒక్క రోజే 853 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,00,312 కి పెరిగింది.
నిన్న 59,384 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,95,48,302కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 5,09,637 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.01 శాతానికి పెరిగిందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 42.6లక్షలు టీకాలు అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 34,00,76,232 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.
Next Story