భార‌త్‌లో పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..

India reports 45951 new covid 19 cases in last 24 hours.దేశంలో రోజువారి కేసుల సంఖ్య నిన్న‌టితో పోల్చితే నేడు పెరిగింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jun 2021 10:03 AM IST
భార‌త్‌లో పెరిగిన క‌రోనా కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..

దేశంలో రోజువారి కేసుల సంఖ్య నిన్న‌టితో పోల్చితే నేడు పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 19,60,757 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 45,951 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,62,848కి చేరింది. నిన్న ఒక్క రోజే 817 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,98,454కి పెరిగింది.

నిన్న 60,729 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,94,27,330కి పెరిగింది. ప్ర‌స్తుతం దేశంలో 5,37,064 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 96.92 శాతానికి పెరిగిందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.34శాతంగా ఉందని చెప్పింది. దేశంలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. నిన్న ఒక్క రోజే 36,51,983 టీకాలు అందించ‌గా.. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 33,28,54,527 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

Next Story