నిన్నటితో పోల్చితే నేడు కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 19,07,216 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 43,733 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,63,665కి చేరింది. నిన్న ఒక్క రోజే 930 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,04,211 కి పెరిగింది.
నిన్న 47,240 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య2,97,99,534 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 4,59,920 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.18శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.39శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.29శాతానికి తగ్గిందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 36,05,998 లక్షలు టీకాలు అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 36,13,23,548 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.