భారత్ కరోనా అప్డేట్.. పెరిగిన కేసులు
India Reports 42015 new covid-19 cases in last 24hours.భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో
By తోట వంశీ కుమార్ Published on 21 July 2021 4:35 AM GMTభారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 18,52,140 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 42,015 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,12,16,337కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,998 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర మరణాల సంఖ్య సవరించడంతో ఈ స్థాయిలో తేడాలు కనిపించాయి. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,18,480 కి పెరిగింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) July 21, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/TXZlXvAxPq pic.twitter.com/jpfoXb7SOe
నిన్న36,977 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,03,90,687కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,07,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.36శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.09శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.27 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 34,25,446 మందికి టీకా అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 41,54,72,455 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.