దేశంలో కరోనా విలయతాండవం.. కొత్తగా ఎన్నికేసులంటే..?
India reports 412262 new covid 19 cases.భారత్‌లో గడిచిన 24 గంటల్లో 19,23,131 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 4,12,262 పాజిటివ్ కేసులు నమోదు
By తోట వంశీ కుమార్ Published on
6 May 2021 4:42 AM GMT

భారత్‌లో కరోనా ఉద్దృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 19,23,131 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 4,12,262 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,10,77,410కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,980 మంది మరణించారు.
దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,30,168కి చేరింది. నిన్న 3,29,113 మంది కోలుకోగా.. మొత్తంగా కరోనా మహమ్మారిని జయించిన వారి సంఖ్య 1,72,80,844కి చేరింది. ప్రస్తుతం దేశంలో 35,66,398 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 29,67,75,209కోట్ల టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 16,25,13,339 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.
Next Story