భారత్‌లో కరోనా మరణ మృదంగం ఆగడం లేదు. వరుసగా రెండో రోజు కూడా నాలుగు వేలకు పైగా మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 18,65,428 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 4,03,738 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,22,96,414కి చేరింది. నిన్న 4,092 మంది మరణించారు.
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,42,362కి పెరిగింది. నిన్న 3,86,444 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 1,83,17,404కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 37,36,648 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 16,94,39,663 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 53,605 కేసులు ఉండగా, కర్ణాటకలో 47,563, కేరళలో 41,971 చొప్పున ఉన్నాయి.