స్వ‌ల్పంగా త‌గ్గిన కేసులు.. పెరిగిన మ‌ర‌ణాలు.. ప్రధాన మోదీ సమీక్ష

new corona cases in India today.భార‌త్‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో 18,04,954 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 3,92,603 పాజిటివ్ కేసులు న‌మోదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 May 2021 4:17 AM GMT
India corona cases

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ఉద్దృతి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే.. నేడు పాజిటివ్ కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గింది. నిన్న నాలుగు ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. గ‌డిచిన 24 గంట‌ల్లో 18,04,954 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 3,92,603 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,95,49,943కి చేరింది.

నిన్న ఒక్క రోజే 3,689 మంది మృతి చెందారు. దీంతో దేశంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,15,542కి చేరింది. నిన్న 3,07,865 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1.59కోట్ల‌కు చేరింది. ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 33,39,644కి చేరింది. రిక‌వ‌రీ రేటు 81.77 శాతం ఉండ‌గా.. మ‌ర‌ణాల రేటు 1.10శాతంగా ఉంది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా మ‌హారాష్ట్రలో 63,282 కేసులు నమోదు అవ్వ‌గా.. కర్ణాటకలో 40,990, కేరళలో 35,636 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అదేవిధంగా మహారాష్ట్రలో 802, ఢిల్లీలో 412, ఉత్తరప్రదేశ్‌లో 303 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రధాన మంత్రి మోదీ సమీక్ష..

దేశంలో కరోనా ఉదృతిని, కేసుల పెరగుదల, అలాగే ఆక్సిజన్ కొరత, మందుల లభ్యతపై గురించి ప్రధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీ సమీక్ష సమావేశం నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌మావేశంలో క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు ఆక్సిజ‌న్ త్వ‌రిత‌గ‌తిన రోగుల‌కు అందేలా చ‌ర్య‌లు చేప‌ట్టేలా నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తోంది. మ‌రో వైపు లాక్‌డౌన్ ఒక్క‌టే.. ప‌రిస్థితిని అదుపులోకి తెస్తుంద‌ని ప‌లువురు నిపుణులు చెబుతున్న నేప‌థ్యంలో ఈ విష‌యం పై కూడా చ‌ర్చించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అయితే.. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పెట్టే ఆలోచ‌నే లేద‌ని ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.


Next Story