భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 19,98,715 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 38,079 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,10,64,908కి చేరింది. నిన్న ఒక్క రోజే 560 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,13,091 కి పెరిగింది.
నిన్న43,916 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,02,27,792 చేరింది. ప్రస్తుతం దేశంలో 4,24,025 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.31శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 2.10శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.91 శాతానికి తగ్గిందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 42.12 లక్షల మందికి టీకా అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 39.96 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.