భార‌త్ లో క‌రోనా ఉగ్ర రూపం.. 30లక్ష‌లు దాటిన యాక్టివ్ కేసులు

New corona cases in India today.భార‌త్లో గ‌డిచిన 24 గంట‌ల్లో 17,68,190 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 3,79,257 పాజిటివ్ కేసులు న‌మోదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 April 2021 10:11 AM IST
India corona cases

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొనసాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 17,68,190 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 3,79,257 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,83,76,524కి చేరింది. నిన్న ఒక్క రోజే 3,645 మంది క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. భార‌త్‌లో ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,04,832కి పెరిగింది.

నిన్న 2,69,507 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,50,86,878కి చేరింది. రిక‌వ‌రీ రేటు 82.33 శాతం ఉండ‌గా.. మ‌ర‌ణాల రేటు 1.12 శాతంగా ఉంది. ప్ర‌స్తుతం దేశంలో 30,84,814 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక టీకాల విష‌యానికి వ‌స్తే.. టీకాలు పొందిన వారి సంఖ్య 15 కోట్లు దాటింది.

యాక్టివ్‌ కేసుల్లో రెండో స్థానం..

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా యాక్టివ్‌ కేసులు ఉన్న జాబితాలో భారత్‌ రెండో స్థానానికి చేరింది. అత్యధికంగా అమెరికాలో 60 లక్షల 80 వేల మందికిపైగా బాధితులు కరోనా చికిత్స పొందుతున్నారు. ఇక రెండో స్థానంలో భారత్‌లో 30 లక్షలకుపైగా కేసులు యాక్టివ్‌గా ఉండగా, బ్రెజిల్‌లో 10 లక్షకుపైగా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక ఫ్రాన్స్‌లో యాక్టివ్‌ కేసులు 10 లక్షలకు చేరువలో ఉన్నాయి.


Next Story