దేశంలో కరోనా మహమ్మారి విలయంతాండవం చేస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండడంతో పాటు వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,23,912 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 3,60,960 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం విడుదలైన బులిటెన్‌లో పేర్కొంది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,79,97,267 కు చేరింది.
నిన్న ఒక్క రోజే 3,293 మంది మృతి చెందారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటికి నుంచి ఒక్క రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక మరణాలు ఇవే. దీంతో దేశంలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,01,187కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,61,162 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 29,78,709 యాక్టివ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా 14,78,27,367 మందికి వ్యాక్సిన్లు వేశారు.