భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 16,68,561 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 35,342 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,12,51,679కి చేరింది. నిన్న ఒక్క రోజే 438 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,19,470 కి పెరిగింది.
నిన్న38,740 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,04,68,079కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,05,513 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.36శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.14శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.12 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 54.76 లక్షల మందికి టీకా అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 42,34,17,030 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.